Telugu Lyrics
కరుణించే నావాడూ - కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు.. యేసూ.....................................................| |2 | |
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు...
నేనెందుకు భయపడవలెను - సామాన్యునివలెనూ......................| |2 | |
1. పోరాటము చేయకుండనే - ఏ ఖడ్గము దూయకుండనే
తరుమువారు పారిపోలేదా........................................................| |2 | |
ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము
బలపరిచే యేసు మాటలో – ఆదరించబడుతున్నాను
| |నేనెందుకు..| |
యేసులో జయం - యేసులో జయం - గొప్ప గొప్ప విజయం ....... | |2 | |
2. బూరలను ఊదినంతనే - ఆర్భాటం చేసినంతనే
కోట గోడ కూలిపోలేదా ...............................................................| |2 | |
నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరరిచే యేసు చేతిలో - భద్రపరచబడియున్నాను
| |నేనెందుకు..| |
3. కుండ పగలగొట్టినంతనే - దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా ...............................................................| |2 | |
లోబడియుండిన చాలును - చేయును ప్రభువే యుద్ధము
ఘనపరిచే యేసు ప్రేమలో - జయము పొందుకొనుచున్నాను
| |నేనెందుకు..| |
Gd lyrics....But the space is not gd
ReplyDeleteSuper song
ReplyDeleteGreat song
ReplyDelete